థైరాయిడ్​ సమస్య ఉంటే.. కంటి చూపు దెబ్బతింటుందా?

07-12-2024 Sat 15:57 | Health
Advertisement
  • మారిన ఆహార అలవాట్లతో పెరుగుతున్న థైరాయిడ్ సమస్య
  • థైరాయిడ్ హార్మోన్ల లోపం వల్ల ఎన్నో ఆరోగ్య సమస్యలు
  • ఇది కంటి చూపు దెబ్బతీయడానికీ దారి తీస్తుందని చెబుతున్న నిపుణులు
Advertisement
మారిన జీవన శైలి, జన్యుపరమైన కారణాలు, సరైన పోషకాలు లేని ఆహారం తీసుకోవడం వంటి కారణాలతో థైరాయిడ్ సమస్య బారినపడుతున్న వారి సంఖ్య పెరిగిపోతోంది. ఇందులో రెండు రకాల సమస్యలు ఉన్నాయి. థైరాయిడ్ హార్మోన్లు సరిగా ఉత్పత్తికాకపోవడం ‘హైపో థైరాయిడిజం’, థైరాయిడ్ అతిగా స్పందించడం ‘హైపర్ థైరాయిడిజం’ అని చెబుతారు. ఈ రెండింటితోనూ కంటి ఆరోగ్యంపై ప్రభావం పడుతుందని... ముఖ్యంగా హైపర్ థైరాయిడిజంతో ఎక్కువ నష్టం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.మన శరీరంలో థైరాయిడ్ గ్రంథి ఉండే ప్రదేశం

దృశ్యాలన్నీ ఉబ్బెత్తుగా కనిపించడం...
థైరాయిడ్ సమస్య ఏర్పడినప్పుడు కళ్ల వెనుక భాగంలో వాపు వచ్చి... కనుగుడ్లపై ఒత్తిడి పెరుగుతుంది. దీనితో అన్నీ కూడా ఉబ్బెత్తుగా (కుంభాకారంలో) కనిపిస్తుంటాయి. ఇది మొదట చాలా మెల్లగా మొదలై ఇబ్బందికరంగా మారుతుంది.
ఈ సమస్య మరింతగా పెరిగితే కళ్ల అలైన్ మెంట్ దెబ్బతిని... అన్నీ రెండుగా కనిపిస్తుంటాయి. దేనిపైనా సరిగా దృష్టి పెట్టలేని పరిస్థితి ఏర్పడుతుంది.

కళ్లు పొడిబారడం, మంటగా అనిపించడం...
థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నవారిలో కన్నీళ్ల ఉత్పత్తి తగ్గిపోతుంది. ఇది కళ్లు పొడిబారడం, దురదగా అనిపించడానికి దారితీస్తుంది. కళ్లు ఎర్రగా మారుతాయి. దీన్ని నిర్లక్ష్యం చేస్తే కంటి చూపుపై ప్రభావం పడుతుంది.

కాంతిని భరించలేకపోవడం...
థైరాయిడ్ హార్మోన్లలో హెచ్చుతగ్గులు, సమస్యల కారణంగా... కళ్లు కాంతిని భరించే సామర్థ్యం తగ్గిపోతుంది. మిగతా వారంతా సాధారణ వెలుగేనని భావించేంత కాంతిని కూడా వీరు తట్టుకోలేకపోతారు. దేనిపై అయినా దృష్టి పెట్టడానికి ఇబ్బందిపడతారు.

కళ్లు ఉబ్బిపోవడం, కనుగుడ్ల కదలికలో ఇబ్బందులు
థైరాయిడ్ సమస్య మరీ ఎక్కువగా ఉన్నవారిలో కళ్లు ఉబ్బిపోతాయి. కనుగుడ్లను అటూ ఇటూ కదిలిస్తూ చూడానికి ఇబ్బంది పడాల్సి వస్తుంది. 

కంటి చూపు కోల్పేయే ప్రమాదం కూడా...
థైరాయిడ్ సమస్య మరీ ఎక్కువగా ఉన్న సమయంలో కళ్ల నుంచి మెదడుకు వెళ్లే నాడులు దెబ్బతినే అవకాశం ఉంటుంది. అదే జరిగితే చూపు కోల్పోయే ప్రమాదం కూడా ఎక్కువేనని నిపుణులు చెబుతున్నారు. అయితే ఇది చాలా అరుదు అని పేర్కొంటున్నారు.

  • అమెరికా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ (ఎన్ఐహెచ్) అధ్యయనం ప్రకారం... మన రోగ నిరోధక కణాలే, మన శరీరంలోని థైరాయిడ్ గ్రంథిపై దాడి చేసే ‘గ్రేవ్స్ డిసీజ్’ వంటి వాటిలో కళ్లపై ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందట.
Advertisement
ThyroidEye visionhealthoffbeatscienceViral News

More Telugu News

భారత రైలులో ఫస్ట్ ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట!

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15

బొత్స సత్యనారాయణకు షాక్.. బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

24-10-2026 Sat 18:09

అతడితో మాట్లాడడం ఆపేశాక బరువు పెరిగాను: జాన్వీ కపూర్ సరదా వ్యాఖ్యలు

24-10-2026 Sat 17:59
..more